సామాజిక న్యాయం కేవలం మాటల్లో కాకుండా, చేతల్లో చూపించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యమవుతుంది..తెలంగాణ గడ్డపై బహుజన, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం ఇందుకు నిలువెత్తు రూపం.. మంచిర్యాల జిల్లాకు చెందిన దళిత నిరుపేద మహిళ అవునూరి శ్రీవాణి గారి జీవితంలో జరిగిన సంఘటన ఇందుకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.
మంచిర్యాల జిల్లా, లక్ష్యెట్పేట మండలం, గుల్లకోట గ్రామానికి చెందిన అవునూరి శ్రీవాణి గారు ఒక సాధారణ దళిత నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ.
గడిచిన సర్పంచ్ ఎన్నికలలో గుల్లకోట గ్రామం నుండి ఆమె ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ గ్రామానికి చెందిన సంప్రదాయ రాజకీయ నాయకులు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. “నీకు ఆర్థిక బలం లేదు, నువ్వు అణగారిన వర్గానికి చెందిన దళిత మహిళా” అంటూ అనేక రకాలుగా అవమానాలకు గురి చేసి , ఆమె సర్పంచ్ గా గెలవకుండా అడ్డుకున్నారు. ఆర్థిక, సామాజిక కారణాలరీత్యా ఆమె తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నారు. సమాజంలో సమూల మార్పు రావాలనే బలమైన ఆకాంక్షతో శ్రీవాణి గారు రగిలిపోయారు..
అదే సమయంలో కల్వకుంట్ల కవిత గారు “సామాజిక తెలంగాణ” సిద్ధాంతంతో పార్టీని స్థాపించారు..అన్ని కులాలకు సమానమైన హక్కులు, గౌరవం దక్కుతాయనే బలమైన నమ్మకంతో శ్రీవాణి గారు కవితమ్మ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీలో చేరారు. కల్వకుంట్ల కవితమ్మ గారు తన మొదటి దశ బాయి బాట పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ‘ఊరూరా జెండా పండుగ’ నిర్వహిస్తున్న సమయంలో, శ్రీవాణి గారు తన గ్రామంలో టీఆర్ఎస్ జెండా గద్దెను నిర్మించుకుని ఒక ఫోన్ మెసేజ్ ద్వారా కవితమ్మను ఆహ్వానించారు.. ఏ గ్రామంలో అయితే శ్రీవాణి గారు వివక్ష ఎదుర్కుందో, అదే చోట కవితమ్మ గారి చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి స్థానిక నాయకులకు సవాల్ విసిరారు.
ఆ జెండా ఆవిష్కరణ ద్వారా సామాజిక తెలంగాణ సాధన కోసం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం కవితమ్మ ఏ స్థాయిలో నిలబడుతున్నారనే స్పష్టమైన సంకేతం సమాజానికి వెళ్ళింది…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వేలాది మంది జనసందోహం మధ్య నిర్వహించిన సామజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో అవునూరి శ్రీవాణి గారికి మాట్లాడే అవకాశం కల్పించి తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు

అణగారిన గొంతుకలకు వేదికపై పెద్దపీట వేయడమే నిజమైన సామాజిక న్యాయమని, దీనికి కవితమ్మ గారు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నారనడానికి శ్రీవాణి గారి ఉదంతమే నిదర్శనం.
మాటల రాజకీయాలకు భిన్నంగా, అణగారిన వర్గాల మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడంలో, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం అసాధారణమైనది. అవునూరి శ్రీవాణి గారి అనుభవం సామాజిక తెలంగాణ సాధనలో కవితమ్మ గారి సంకల్ప బలాన్ని చాటిచెప్పే చారిత్రక సత్యం.
