September 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

కాంగ్రెస్ కు షాక్.. కేసీఆర్ గూటికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు

తెలంగాణ రాజకీయ రంగస్థలంపై మరో ఉత్కంఠభరిత ఘట్టం ఆవిష్కృతమవుతోంది! కాంగ్రెస్ హవాలో బీఆర్ఎస్ నుంచి 'హస్తం' గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. స్పీకర్ స్థానంలోనూ, కోర్టుల ప్రాంగణాల్లోనూ అనర్హత వేటు పిటిషన్లు వేడెక్కుతున్న వేళ… సొంత పక్షంలోనే ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. ఆశించిన స్థానం దక్కకపోవడం, పాత కాంగ్రెస్ కేడర్ తిరుగుబాట్లు, నియోజకవర్గాల్లో పట్టు సడలుతుండటంతో ఫిరాయింపు నేతల గుండెల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.

పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి వంటి హేమాహేమీలు కాంగ్రెస్ సర్కార్‌పై బహిరంగంగానే విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఊహాగానాలకు తెరదించుతూ, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం, గులాబీ కండువా కప్పుకొని బీఆర్‌ఎస్ఎల్పీ (BRSLP) సమావేశానికి ప్రత్యక్షమవ్వడం రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా ఉలెక్కిపడేలా చేసింది!

కోదాడ ప్రమాద మృతులకు పవన్ కళ్యాణ్ సంతాపం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్ధం కాలేదు..

బాలకృష్ణ శోభన్ బాబు మల్టీ స్టారర్ , ఇళయరాజా అల్టిమేట్ సాంగ్స్, మీనా నగ్మా లాంటి టాప్ హీరోయిన్స్,అమ్రిష్ పురి విలన్, రాఘవేంద్ర రావు డైరెక్షన్ ….హై బడ్జెట్ తో, ఆకాశాన్నంటే అంచనాలతో రిలీజ్ అయిన మూవీ. శోభన్ బాబు పాత్రను మధ్యలో చంపేయడం, క్లైమాక్స్ సాగదీత, అక్కడ సాంగ్ పెట్టడం..మూవీ పరాజయానికి కారణాలు. గజిని మూవీలో విలన్ క్యారక్టర్ లో ట్విస్ట్ అశ్వమేధం లో ఎప్పుడో పెట్టారు.

శోభన్ గారి ఫాన్స్ అయన సూసైడ్ చేసుకునే సీన్ తీసేయమని గొడవ చేసారు. కేవలం మాకు మాత్రమే మంచి హిట్ ఇవ్వలేదనే కోపంతో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ లో ఉన్న రాఘవేంద్ర రావు మీదకు గొడవకు వెళ్లారు బాలయ్య ఫాన్స్. ఈ సినిమా తర్వాత రాఘవేంద్ర రావు తో కానీ, అశ్వనీదత్ తో కానీ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు బాలయ్య. కానీ రాఘవేంద్ర రావు తో ఎప్పటికో పాండు రంగడు చేసారు. అయితే అశ్వమేధం మూవీ మాత్రం ఎప్పుడు టీవీ లో చూసినా "బాగుందే , ఎందుకు ప్లాప్ అయిందబ్బా " అనిపిస్తుంది

శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం

ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజు సభా కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.

‘వెంకీ అనిల్-5’పై ఆసక్తికర అప్‌డేట్

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వెంకీ అనిల్ 5’పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సక్సెస్ తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

తాజాగా విడుదలైన ఆయన లుక్‌లో పూర్తిగా కొత్తగా, గంభీరమైన మిలటరీ అధికారిగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంకటేష్ గతంలో చేసిన ఫ్యామిలీ, కామెడీ, ఎమోషనల్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొనసాగిస్తూనే కథలో యాక్షన్, ఎమోషన్‌ను కూడా మేళవిస్తున్నట్లు సమాచారం. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు కొత్త తరహా యాక్షన్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసేలా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లెఫ్టినెంట్ కర్నల్ పాత్ర కోసం వెంకటేష్ లుక్‌ను మార్చడం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. సినిమాలో ఆయన పాత్ర కథను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, మిలటరీ నేపథ్యం ఎంతవరకు కీలకంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అనిల్ రావిపూడి–వెంకటేష్ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ కొత్త అవతారం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారేలా కనిపిస్తోంది.

ఏడేళ్ల సస్పెన్స్ కు తెర: సరికొత్త లుక్ లో రెబల్ స్టార్ ‘ఇన్‌స్టా DP’ వైరల్!

హైదరాబాద్: పాన్-ఇండియా కటౌట్, రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్నా సరే... ఆయన పేరు వినిపిస్తే చాలు రికార్డులు తిరగబడాల్సిందే. స్క్రీన్ పైనే కాదు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా చేసిన ఒక చిన్న మార్పు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఏకంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ డిస్‌ప్లే పిక్చర్ (DP)ను మార్చడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

2017 తర్వాత మళ్లీ ఇప్పుడే... ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి అంటే దాదాపు ఏడేళ్లుగా ఒకే ఫొటో (బాహుబలి లుక్ లేదా పాత పిక్) మాత్రమే డిపీగా ఉండేది. సాధారణంగా స్టార్ హీరోలు తమ ప్రతి సినిమా విడుదల సమయంలోనో, లేదా ఏదైనా షూట్ ఉన్నప్పుడో తరచూ DPలు మారుస్తూ ఉంటారు. కానీ, ప్రభాస్ శైలి వేరు. ఆర్బాటం లేని జీవితాన్నిష్టపడే ప్రభాస్, సోషల్ మీడియా యాక్టివిటీకి కాస్త దూరంగానే ఉంటారు. అలాంటిది అకస్మాత్తుగా ఆయన తన ప్రోఫైల్ పిక్చర్ మార్చేసరికి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

కొత్త లుక్... నయా వైబ్! తాజాగా ప్రభాస్ అప్‌డేట్ చేసిన DPలో ఆయన అత్యంత స్టైలిష్ గా, రాయల్ లుక్ లో కనిపిస్తున్నారు. చార్మింగ్ షేడ్స్, పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఈ పిక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. "ఏడేళ్ల నిరీక్షణకు తగిన న్యాయం జరిగింది", "కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!" అంటూ సోషల్ మీడియా కామెంట్ సెక్షన్లలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాన్ పేజీలు, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ఫొటో నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

అప్ కమింగ్ సినిమాల మేనియానేనా? అయితే, ప్రభాస్ అకస్మాత్తుగా DP మార్చడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనే చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. దర్శకుడు మారుతితో చేస్తున్న భారీ ఎంటర్‌టైనర్, అలాగే సందీప్ రెడ్డి వంగాతో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్', ప్రశాంత్ నీల్ తో 'సలార్ 2' కాంబినేషన్లు లైనప్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే రాబోయే కొత్త సినిమా అప్‌డేట్‌కు సంకేతంగానే ఈ లుక్ మార్చారా? లేక ఇది కేవలం ఒక క్యాజువల్ చేంజ్ మాత్రమేనా? అని సినీ విశ్లేషకులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.

సోషల్ మీడియాలో 'ప్రభాస్ హవా' ఏది ఏమైనా, ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా కేవలం ప్రొఫైల్ పిక్చర్ మార్చడం ద్వారానే మిలియన్ల కొద్దీ లైక్స్, వేలాది కామెంట్స్ రాబట్టడం ఒక్క ప్రభాస్‌కే సాధ్యమైంది. డిజిటల్ మీడియాలో ఆయనకున్న తిరుగులేని క్రేజ్‌కు ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం 'రాయల్ ప్రభాస్' డిపీ సోషల్ మీడియా వేదికలపై సంచలనం సృష్టిస్తూ, ట్రెండింగ్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వైసీపీ రాష్ట్ర దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దస్తగిరి

సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడేవారిని గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటుంది. వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు, జర్నలిస్ట్, షేక్ దస్తగిరిని పార్టీ రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిన్న వయసులోనే ఇటువంటి కీలకమైన రాష్ట్రస్థాయి బాధ్యత దక్కడం పట్ల వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మగౌరవ పోరాటాల దస్తగిరి: పోరాటమే ఊపిరిగా..
షేక్ దస్తగిరి పేరు వినగానే గుర్తుకువచ్చేది ఆయనలోని ప్రజా పోరాట పటిమ. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ కలిగి, నూర్ బాషా/దూదేకుల వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన గళమెత్తారు. వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం, దూదేకుల సామాజిక వర్గ ఆత్మగౌరవం కోసం ఆయన రాజీలేని పోరాటాలు చేశారు.

అణగారిన వర్గాల సంక్షేమం కోసం దస్తగిరి చేపట్టిన నిరాహార దీక్షలు, నిర్వహించిన పోరాట వేదికలు ఆయనలోని పట్టుదలను, ప్రజా నిబద్ధతను చాటిచెప్పాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షలకు దిగిన తీరు ఆయనలోని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.

జగన్ దృష్టిని ఆకర్షించిన నిబద్ధత
పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి దస్తగిరి నియామకమే ఒక ఉదాహరణ. దూదేకుల సామాజిక వర్గ సంక్షేమానికి ఆయన పడిన తపన, జరిపిన ఉద్యమాలు వైయస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గంతో పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, దూదేకుల సామాజిక వర్గ ప్రతినిధులు దస్తగిరిని కలిసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

సమర్థవంతమైన నాయకత్వంతో కొత్త శకం
షేక్ దస్తగిరి నాయకత్వంలో వైయస్ఆర్సీపీ నూర్ బాషా/దూదేకుల విభాగం మరింత క్రియాశీలకంగా మారనుందనడంలో సందేహం లేదు. చిన్న వయసులోనే ఈ స్థాయి ప్రాతినిధ్యం పొందిన దస్తగిరి, రాబోయే రోజుల్లో పార్టీ పరంగానూ మరియు సామాజికంగానూ తన ముద్ర వేస్తూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దస్తగిరి శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ..
"నన్ను నమ్మి ఈ చిన్న వయసులోనే రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన మన ప్రియతమ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని,. నూర్ బాషా, దూదేకుల సామాజిక వర్గాల సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని మూలమూలలా ఉన్న నూర్ బాషా సోదరులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కిందకు తెచ్చి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తాను."

కోటీశ్వ‌రుడిని పెళ్లాడి, క్లీన‌ర్‌తో లేచిపోయింది.!

కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా జంట.. అఖిల్ , మేఘా . ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరికీ లక్షలాది మంది ఫాలోవర్లు. క్యూట్ వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్‌తో ఎంతోమందికి ఫేవరెట్ కపుల్‌గా మారిపోయారు. కానీ.. ఆ చిరునవ్వుల వెనుక దాగి ఉన్న నిజం మాత్రం ఇప్పుడు బయటపడిందంటూ అఖిల్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

తన భార్య మేఘా.. ఓ లోకల్ బస్సు క్లీన‌ర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అఖిల్ ఆరోపించాడు. అంతేకాదు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులు కూడా తీసుకెళ్లిందని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు తమ ప్రేమకథను చూసి అసూయపడిన వాళ్లే. ఇప్పుడు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇంత హ్యాపీగా కనిపించిన వాళ్ల జీవితంలో ఇంత పెద్ద తుఫాన్ ఉందా..?" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ విడుదల చేసిన వీడియోలో.. తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించాడు. తాను తీవ్ర మానసిక వేదనలో ఉన్నానని కూడా చెప్పాడు.

అయితే.. ఈ వ్యవహారంపై మేఘా నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఆమె వాదన ఏంటి..? నిజంగా ఏం జరిగింది..? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి నవ్వు నిజమైన ఆనందమే కాదు. ప్రతి రిలేషన్‌షిప్ కూడా బయటకు కనిపించినంత పరిపూర్ణంగా ఉండకపోవచ్చు అనే చర్చ ఇప్పుడు మరోసారి మొదలైంది.

ఒక వైరల్ వీడియోతో మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అఖిల్ చేసిన ఆరోపణలు మాత్రమే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మేఘా స్పందన, అలాగే అధికారిక వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూర్తి నిజాలు బయటపడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో కనిపించే జీవితానికీ.. నిజ జీవితానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో చెప్పే మరో ఉదాహరణగా ఈ ఘటన చర్చనీయాంశమవుతోంది

ఉండి రాజకీయంలో కొత్త అధ్యాయం: 2029 టార్గెట్..

పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ‘ఉండి’ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పోరాటాలకు వేదికయ్యే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మంతెన యోగేంద్రబాబు శైలి, ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.

బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ సమయంలోనే క్షేత్రస్థాయిలో పార్టీకి సరికొత్త ఊపిరి ఊదడంలో యోగేంద్రబాబు సఫలమవుతున్నారనే అభిప్రాయం కేడర్‌లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఉత్సాహవంతమైన నాయకత్వం, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఆయన శైలిపై ప్రత్యేక విశ్లేషణ.

క్షేత్రస్థాయికి పార్టీ కార్యచరణ: వేగవంతమైన అడుగులు

ఏ రాజకీయ పార్టీకైనా నాయకత్వ మార్పు జరిగినప్పుడు క్షేత్రస్థాయి కేడర్‌ను సమాయత్తం చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఉండి నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. యోగేంద్రబాబు ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే పార్టీ కార్యక్రమాల్లో గమనాన్ని పెంచారు.

  • గ్రామ స్థాయి భేటీలు: నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలో పర్యటిస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో నేరుగా సమావేశమవుతున్నారు.

  • కార్యకర్తలకు భరోసా: గత ఎన్నికల తదనంతర పరిణామాలతో కొంత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు నేరుగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.

  • ప్రజా సమస్యలపై పోరాటం: స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజల పక్షాన గళమెత్తేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

యువతతో మమేకం: మారిన రాజకీయ వ్యూహం

నేటి రాజకీయాల్లో యువత పాత్ర అత్యంత కీలకమైంది. ఈ విషయాన్ని సరిగ్గా గుర్తించిన యోగేంద్రబాబు, తన పర్యటనల్లో యువతను భాగస్వాములను చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

ఆయన స్వయంగా యువకుడు, ఉత్సాహవంతుడు కావడం వల్ల స్థానిక యువత ఆయనతో సులభంగా మమేకం కాగలుగుతోంది. డిజిటల్ మాధ్యమాలు, ముఖాముఖి సమావేశాల ద్వారా యువతరం ఆలోచనలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తున్నారు. క్రీడా పోటీలు, యువజన సమావేశాల ద్వారా యంగ్ జనరేషన్‌ను పార్టీ వైపు ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రస్తుత రాజకీయ సమీకరణాలు: ఎమ్మెల్యే రఘురామ వర్సెస్ యోగేంద్రబాబు

ప్రస్తుతం ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్, శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకున్న రాజకీయ అనుభవం, మీడియా కవరేజ్, ప్రచార శైలికి సరిజోడుగా క్షేత్రస్థాయిలో గట్టి పోటీనిచ్చే నాయకత్వం కోసం వైఎస్సార్‌సీపీ చూస్తున్న తరుణంలో యోగేంద్రబాబు రాక ఆ లోటును భర్తీ చేసినట్లయింది.

రఘురామకృష్ణంరాజు వంటి సీనియర్ నాయకుడిని ఎదుర్కోవాలంటే కేవలం మైక్ ముందు మాట్లాడటం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రతి ఇల్లు తిరిగే ఓర్పు, జనంతో మమేకమయ్యే ఉత్సాహం అవసరం. యోగేంద్రబాబు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు అనుభవానికి, యోగేంద్రబాబు యువ రక్తం, వేగానికి మధ్య సాగుతున్న ఈ రాజకీయ సమరం ఉండిలో ఆసక్తికరంగా మారింది.

ప్రజాభిప్రాయం: వచ్చే ఎన్నికల్లో జెండా ఎగిరేనా?

ఉండి నియోజకవర్గ ప్రజా బాహుళ్యంలో, రాజకీయ విశ్లేషకుల్లో ఇప్పుడు ఒకటే చర్చ సాగుతోంది. యోగేంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చూపిస్తున్న ఇదే స్పీడ్‌ను, పట్టుదలను చివరి వరకు కొనసాగిస్తే... వచ్చే ఎన్నికల్లో ఉండిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమనే ధీమా కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

స్థానిక ప్రజల నుంచి వస్తున్న స్పందన, తటస్థుల నుంచి లభిస్తున్న మద్దతు పార్టీకి సానుకూల అంశాలుగా మారుతున్నాయి. నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ, ప్రజా సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

విశ్లేషణ: యోగేంద్రబాబు ముందున్న సవాళ్లు

యోగేంద్రబాబు ఆరంభ శూరుడిగా కాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో గెలుపు తీరాలకు చేరాలంటే కొన్ని కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది:

  1. నాయకుల మధ్య సమన్వయం: నియోజకవర్గంలోని పాత, కొత్త నాయకత్వాల మధ్య పూర్తిస్థాయి సమన్వయాన్ని సాధించడం.

  1. స్థిరమైన కార్యాచరణ: ఈ ఉత్సాహాన్ని, వేగాన్ని ఎన్నికల వరకు ఏమాత్రం తగ్గకుండా నిలబెట్టుకోవడం.

  1. బూత్ స్థాయి నెట్‌వర్క్: ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో బలమైన కార్యకర్తల సైన్యాన్ని సిద్ధం చేసుకోవడం.

యోగేంద్రబాబు రాకతో ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీలో కొత్త అధ్యాయం ప్రారంభమైందనడంలో సందేహం లేదు. ఆయన చూపిస్తున్న చురుకుదనం, యువతతో అనుబంధం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చూపిస్తున్న తెగువ పార్టీకి కొత్త ఊపునిచ్చాయి. ఈ జోరును ఇలాగే కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే, రాబోయే ఎన్నికల్లో ఉండి గడ్డపై వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది.

తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం..!

TOP