April 13, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

జగన్ సారధ్యంలో జాతికోసం మరింతగా..!

పిన్న వయసులోనే జాతికోసం ఆలోచించాడా యువకుడు.. రాష్ట్రస్థాయి జర్నలిస్టుగా, మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే కెరీర్ ను పణంగా పెట్టి కులం కోసం నడుంబిగించాడు.. 2018లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ స్థాపించాడు.. దూదేకుల ముస్లింలకు సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదని గొంతెత్లి నినదించాడు.. అమరావతిలో పొలిటికల్ జేఏసీ ప్రారంభించి అక్కడే కార్యాలయాన్ని నెలకొల్పాడు.. 2019 ఎన్నికల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, దూదేకుల సమాజానికి తన ఉద్దేశాన్ని బలంగా చాటిచెప్పాడు..

ఉన్నత వర్గాల్లోని రాజకీయ కుటుంబాల్లో ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లు ఉండొచ్చు కానీ వెనుకబడిన, విస్మరించబడిన దూదేకుల జాతినుండి ఒక్క ఎమ్మెల్యే ఉండకూడదా అని ప్రశ్నించాడు.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడమే కాదు.. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ నినాదాన్ని వదిలిపెట్టలేదు.. ప్రధాన మీడియా చానెళ్లలో డిబేట్లు, పత్రికల్లో వార్తలు ఊపందుకున్నాయి. దూదేకుల కులం గురించి సర్వత్రా చర్చించుకున్నారు. కేవలం దస్తగిరి అనే యువకుడు నడుం బిగించడం వల్లే..కేవలం రాజకీయ అజెండానే కాదు దూదేకుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసాడు.. దూదేకుల కులం ఎదుర్కుంటున్న అసభ్య పదాలను తొలగిస్తూ జీవో తెచ్చిన ఘనత దస్తగిరిదే.. అసలు దూదేకుల కమ్యూనిటీ పేరుతో జివో రావడమే మొదటిది..

దస్తగిరి పోరాటాన్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీలో చేరిన వెనువెంటనే వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి సాధించాడు.. దస్తగిరి చేస్తున్నది రాజకీయ పోరాటమే, దూదేకుల ఉనికిని బ్రతికించడమో కాదు.. అధికారంలో భాగస్వామ్యం, ఆత్మగౌరవ పోరాటం.. దూదేకులంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం కాదు రాష్ట్రంలోని ప్రధాన కులాల్లో మాదీ సింహభాగమేనన్న గుర్తింపు.. చిన్న వయసునుండే పోరాటాలు, కులం కోసం ఉద్యమాలు చేపట్టిన దస్తగిరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, జాతికోసం మరింత వేగంగా అడుగులు వేయాలని యావత్ దూదేకుల సమాజం ఆశిస్తోంది.. ఆశీర్వదిస్తోంది..

కాకినాడ ప్రమాదంపై దస్తగిరి దిగ్బ్రాంతి..

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై వైసీపీ నేత దస్తగిరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఈ భారీ పేలుడు విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.

భార్య జ్ఞాపకార్థం సీఫీకి సోలార్ లైటింగ్, ఫ్యాన్‌లు బహూకరించిన శాంతమూర్తి

హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్డులోని తెలుగు సీఫీ క్రైస్తవ విద్యాసేవ కార్యాలయంలో శ్రీమతి రాచకొండ విజయకుమారి గారి జ్ఞాపకార్థం వారి భర్త శాంతమూర్తి సోలార్ లైటింగ్ సిస్టమ్ మరియు ఫ్యాన్‌లను బహూకరించారు. ఈ సోలార్ లైటింగ్ సిస్టమ్‌ను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి వై.ఎస్. విమలా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాచకొండ విజయకుమారి గారు దేవునియందు భయ భక్తులు కలిగినవారు, విద్యార్థుల పట్ల అంకితభావం కలిగిన ఉత్తమ ఉపాధ్యాయురాలని పేర్కొన్నారు.

ఆమె విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్రవేసినారని కొనియాడారు. సెప్టెంబర్ 2025లో తెలుగు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రభుత్వ తరఫున అందుకున్న ఆమె సేవలు ప్రశంసనీయమని తెలిపారు. విజయకుమారి జ్ఞాపకార్థం తెలుగు సీఫీ కార్యాలయంలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయించిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె గుర్తుగా శాంతమూర్తి ఈ కార్యక్రమం నిర్వహించడంపై అభినందించారు. భార్యపై ప్రేమను ఈ విధంగా చాటుకోవడం గొప్పవిషయమని పలువురు కొనియాడారు. ఈ సోలార్ సిస్టమ్‌ను son.et Lumiere సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పృధ్వీరాజ్ రెడ్డి, జయప్రకాశ్, జగన్ మోహన్ రెడ్డి, టి.సురేష్, మౌనిక, ఆశ ప్రశాంతి, ఫిలిప్, భాస్కర్, భారతీ భాస్కర్, చల్లా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో బీసీ గొంతుకై నినదిస్తున్న మారేష్.. మోదీ సాక్షిగా 10లక్షలమందితో..

దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27శాతం నుంచి 56 శాతానికి పెంచాలని కోరారు. విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న బీసీ క్రిమిలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ, తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బీసీల మేధోమదన సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. మారేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీజేపీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, పాకా సత్యనారాయణ, టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, కలిశెట్టి అప్పలనాయుడు, బస్తీపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల డిమాండ్ల సాధన, ఆత్మగౌరవం కోసం బీసీలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఏప్రిల్‌లో 10 లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా బీసీ గర్జన బహిరంగ సభను నిర్వహించబోతున్నామని తెలిపారు. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ను తీసుకురావాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కాగా, కేంద్రం రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని పాకా సత్యనారాయణ కోరారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు నేటికీ అందని ద్రాక్షలాగా ఉండటం దురదృష్టకరమని ఎంపీ బస్తీపాటి నాగరాజు అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో చట్టసభలలో బీసీలకు సరైన న్యాయం జరగాలంటే పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన త్వరితగతిన చేపట్టాలని ఎన్‌.మారే్‌ష డిమాండ్‌ చేశారు.

అజయ్ ను చట్టపరంగా శిక్షిస్తాం.. జగన్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన మల్లీశ్వరి

ఏపీ రాజకీయాల్లో తెనాలి మహిళ గీతాంజలి మరణం వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి, సోషల్ మీడియా వార్‌కు ఆఘటన కారణయమైంది. టీడీపీ , జనసేన ట్రోలింగ్ కారణంగానే మానసిక వేదనతో గీతాంజలి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపించారు. అప్పటి వైసీపీ మంత్రులు గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ కేసులో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అజయ్ సజ్జాను గతంలో పోలీసులు అరెస్టు చేసారు. అజయ్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయటం వల్లే గీతాంజలి మృతి చెందిందని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. అనంతరం అజయ్ బెయిల్ పై విడుదలయ్యారు.. ఇదంతా గతం..

అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చిందంటే.. వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లీశ్వరి ఇటీవల ఓ టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతున్నారు.. అదే డిబేట్ లో టీడీపీ తరపున పాల్గొన్న అజయ్ సజ్జా సబ్జెక్ట్ మాట్లాడకుండా జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే అనే పదం ఉపయోగించారు. వెంటనే కోపం చిర్రెత్తుకురావడంతో మల్లీశ్వరి రెచ్చిపోయారు. దమ్ము ధైర్యం లాంటి పదాలు ఉపయోగించవద్దని ఇప్పటికే లక్షసార్లు చెప్పానని అయినా నువ్వు మారడం లేదన్నారు. ఇలా విసిగించే గీతాంజలి మరణానికి కారణమయ్యావని, 2029లో వైసీపీ ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఇందుకు మూల్యం చెల్లించుకుంటావని, చట్టపరంగా ఆ కేసుపై మరింత దర్యాప్తు జరిపి శిక్షిస్తామన్నారు.

మల్లీశ్వరి మాటలకు అజయ్ నోట మాట రాలేదు.. పైగా మల్లీశ్వరి ఎంతో కాన్ఫిడెన్స్ తో 2029లో తమ ప్రభుత్వం వస్తుందని నమ్మడం.. అలాగే జగన్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడినందుకు ఒక్కసారిగా విరుచుకు పడడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకురాలు కదా మనకి కావాల్సింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు..

TOP