తెలంగాణ రాజకీయ రంగస్థలంపై మరో ఉత్కంఠభరిత ఘట్టం ఆవిష్కృతమవుతోంది! కాంగ్రెస్ హవాలో బీఆర్ఎస్ నుంచి 'హస్తం' గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. స్పీకర్ స్థానంలోనూ, కోర్టుల ప్రాంగణాల్లోనూ అనర్హత వేటు పిటిషన్లు వేడెక్కుతున్న వేళ… సొంత పక్షంలోనే ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. ఆశించిన స్థానం దక్కకపోవడం, పాత కాంగ్రెస్ కేడర్ తిరుగుబాట్లు, నియోజకవర్గాల్లో పట్టు సడలుతుండటంతో ఫిరాయింపు నేతల గుండెల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.
పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి వంటి హేమాహేమీలు కాంగ్రెస్ సర్కార్‌పై బహిరంగంగానే విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఊహాగానాలకు తెరదించుతూ, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం, గులాబీ కండువా కప్పుకొని బీఆర్‌ఎస్ఎల్పీ (BRSLP) సమావేశానికి ప్రత్యక్షమవ్వడం రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా ఉలెక్కిపడేలా చేసింది!
సామాజిక న్యాయం కేవలం మాటల్లో కాకుండా, చేతల్లో చూపించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యమవుతుంది..తెలంగాణ గడ్డపై బహుజన, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం ఇందుకు నిలువెత్తు రూపం.. మంచిర్యాల జిల్లాకు చెందిన దళిత నిరుపేద మహిళ అవునూరి శ్రీవాణి గారి జీవితంలో జరిగిన సంఘటన ఇందుకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.
మంచిర్యాల జిల్లా, లక్ష్యెట్పేట మండలం, గుల్లకోట గ్రామానికి చెందిన అవునూరి శ్రీవాణి గారు ఒక సాధారణ దళిత నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ.
గడిచిన సర్పంచ్ ఎన్నికలలో గుల్లకోట గ్రామం నుండి ఆమె ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ గ్రామానికి చెందిన సంప్రదాయ రాజకీయ నాయకులు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. "నీకు ఆర్థిక బలం లేదు, నువ్వు అణగారిన వర్గానికి చెందిన దళిత మహిళా" అంటూ అనేక రకాలుగా అవమానాలకు గురి చేసి , ఆమె సర్పంచ్ గా గెలవకుండా అడ్డుకున్నారు. ఆర్థిక, సామాజిక కారణాలరీత్యా ఆమె తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నారు. సమాజంలో సమూల మార్పు రావాలనే బలమైన ఆకాంక్షతో శ్రీవాణి గారు రగిలిపోయారు..
అదే సమయంలో కల్వకుంట్ల కవిత గారు "సామాజిక తెలంగాణ" సిద్ధాంతంతో పార్టీని స్థాపించారు..అన్ని కులాలకు సమానమైన హక్కులు, గౌరవం దక్కుతాయనే బలమైన నమ్మకంతో శ్రీవాణి గారు కవితమ్మ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీలో చేరారు. కల్వకుంట్ల కవితమ్మ గారు తన మొదటి దశ బాయి బాట పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 'ఊరూరా జెండా పండుగ' నిర్వహిస్తున్న సమయంలో, శ్రీవాణి గారు తన గ్రామంలో టీఆర్ఎస్ జెండా గద్దెను నిర్మించుకుని ఒక ఫోన్ మెసేజ్ ద్వారా కవితమ్మను ఆహ్వానించారు.. ఏ గ్రామంలో అయితే శ్రీవాణి గారు వివక్ష ఎదుర్కుందో, అదే చోట కవితమ్మ గారి చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి స్థానిక నాయకులకు సవాల్ విసిరారు.
ఆ జెండా ఆవిష్కరణ ద్వారా సామాజిక తెలంగాణ సాధన కోసం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం కవితమ్మ ఏ స్థాయిలో నిలబడుతున్నారనే స్పష్టమైన సంకేతం సమాజానికి వెళ్ళింది…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వేలాది మంది జనసందోహం మధ్య నిర్వహించిన సామజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో అవునూరి శ్రీవాణి గారికి మాట్లాడే అవకాశం కల్పించి తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు
అణగారిన గొంతుకలకు వేదికపై పెద్దపీట వేయడమే నిజమైన సామాజిక న్యాయమని, దీనికి కవితమ్మ గారు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నారనడానికి శ్రీవాణి గారి ఉదంతమే నిదర్శనం.
మాటల రాజకీయాలకు భిన్నంగా, అణగారిన వర్గాల మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడంలో, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం అసాధారణమైనది. అవునూరి శ్రీవాణి గారి అనుభవం సామాజిక తెలంగాణ సాధనలో కవితమ్మ గారి సంకల్ప బలాన్ని చాటిచెప్పే చారిత్రక సత్యం.
యువ నాయకుడు, పోరాటాల ఒడిలో ఓనమాలు నేర్చుకొని చిన్ననాటి నుండి పోరాటమే ద్యేయంగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకొని ఎర్ర జెండా నీడలో పెరిగిన లీడర్ సోతుకు ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు భూపాలపల్లి లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సింగరేణి బిడ్డగా, కాంగ్రెస్, cpm పార్టీలు బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థిగా 28 వ వార్డు నుండి పోటీలో ఉన్నాడు…
చిన్న నాటి నుండే ప్రజా సమస్యల కోసం పోరాడినవాడు ప్రవీణ్… కమ్యూనిస్టు పార్టీ cpi లో విద్యార్థి విభాగం AISF లో చురుగ్గా పనిచేసి రాష్ట్ర స్థాయి లో కీలక పదవి లో ఉన్నాడు..విద్యార్థి ఉద్యమాలలో ముందుండి నడిచి భూపాలపల్లి లో విద్యార్థుల సమస్యలను అనేకం పరిష్కరించాడు… విద్యార్థి దశలోనే విద్యార్థుల హక్కుల కోసం పోరాడి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల SC, ST, BC హాస్టళ్లు సాధించేందుకు అనేక ఉద్యమాలు చేసి విజయాలు సాధించాడు..ప్రస్తుతం cpi పార్టీ భూపాలపల్లి పట్టణ కార్యదర్శి గా పని చేస్తూ ప్రజా ఉద్యమాలలో ముందుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాడు..గూడు లేని నిరుపేదల మొహాల్లో నవ్వు కోసం నిరంతరం పోరాడి వారి కంటూ ఒక గుడిసె వచ్చేలా పోరాడిన యువకుడు, ఇప్పుడు భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి 28 వ వార్డు అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నాడు..
సింగరేణి బిడ్డగా, స్థానిక యువకునిగా 28వ వార్డు నుండి సోతుకు ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నాడు… 28వ వార్డు లో ఉన్న సింగరేణి కార్మికులు తనకు ఒక్క సారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాడు…ఈ నెల 11 న జరిగే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు..
సీఎం ఆఫీసులో పరిచయాలు ఉన్నాయని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుడు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నివసిస్తూ తనకు సీఎం ఆఫీసులో పరిచయాలు ఉన్నాయని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు సృష్టించిన కాకినాడ ప్రాంతానికి చెందిన కె.రామకృష్ణ అనే వ్యక్తి.. నామినేటెడ్ పదవులు, బదిలీల పేరిట, పలువురు నాయకులు, పోలీసుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుడు. మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.
కొల్లోజు దిలీప్.. యువకుడు..నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు.. విద్యార్థుల సమస్యల కోసం పోరాడినవాడు.. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు..
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 4 వ వార్డ్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొల్లోజు దిలీప్ ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బరిలోకి దించారు..ఇంకా బీ ఫాం ఇవ్వనప్పటికీ 4 వ వార్డ్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొల్లోజు దిలీప్ పోటీలో ఉన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది… దిలీప్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో విద్యా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు…దీంతో మున్సిపల్ బరిలో దిలీప్ ఉన్నాడంటూ ప్రచారం మొదలు కావడం తో ప్రత్యర్థుల గుండెల్లో దడ మొదలైంది…
ఎన్నికల బరిలో దిలీప్ ఉంటే తమకు ఓటమీ ఖరారు అని తెలుసుకున్న ప్రత్యర్థులు ఇప్పటినుండే దిలీప్ ను ఎన్నికల బరి నుండి తొలగించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఓ వైపు ప్రజల మద్దతు మాత్రం అనూహ్యంగా దిలీప్ వైపే ఉండటం చూసి ప్రత్యర్ధులు కంగారు పడుతున్నారు..ఎక్కడ దిలీప్ కు లభించే మద్దతు తమ ఓటమికి కారణమవుతుందోనని బయపడుతున్నారు…
మరో పక్క కొల్లోజు దిలీప్ మాత్రం తనకు పార్టీ టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు.. కష్ట పడే మనస్తత్వము ఉన్నవాన్ని,ప్రజా సమస్యల పై పోరాటం చేసే వాడిని కనుక గండ్ర వెంకట రమణా రెడ్డి తనకే టికెట్ కేటాయిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..4 వ వార్డు నుండి తాను లోకల్ అభ్యర్ధి అని, మిగతా వారు నాన్ లోకల్ కాబట్టి ప్రజల మద్దతు తనకే ఉంటుందని ఆయన నమ్ముతున్నారు…గతం లో గెలిచిన అభ్యర్థులు ఓట్ల అప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తనకు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే 4 వ వార్డ్ లో విజయ పతాకం ఎగురవేసి గండ్ర వెంకట రమణా రెడ్డి కి, బీఆర్ఎస్ పార్టీ కి 4 వ వార్డు ను గిఫ్ట్ గా అందిస్తానని దిలీప్ చెబుతున్నారు.