February 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

కృష్ణా జిల్లా, నందివాడ మండలం, తరిమిస గ్రామంలో ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన విజయలక్ష్మిపై ఆమె భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి తీవ్రంగా దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరుకు చెందిన విజయలక్ష్మిని తరిమిస గ్రామానికి చెందిన రఘునాథ్ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తూ, అనేకసార్లు తనపై దాడులు చేశారని విజయలక్ష్మి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు సంధి జరిగినప్పటికీ, భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి వేధింపులు కొనసాగించారని తెలిపింద
ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా విజయలక్ష్మి తన తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో రేపల్లెలో నివసిస్తున్న రఘునాథ్ అన్నయ్య ఫోన్ చేసి, “ఇకపై వేధింపులు ఉండవు, జాగ్రత్తగా చూసుకుంటాం” అంటూ కాపురానికి రావాలని కోరడంతో, నిన్న తన భర్త ఇంటికి వెళ్లినట్లు తెలిపింది.


అయితే అక్కడికి వెళ్లిన వెంటనే “నిన్నెవరు రమ్మన్నారు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు డబ్బులు కావాలి” అంటూ భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి తీవ్రంగా దూషించి, కర్రలతో విజయలక్ష్మిపై, ఆమె తండ్రి గోవింద రాజాచార్యులపై దాడి చేశారని ఆరోపించింది. అంతేకాకుండా తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది.


దాడిలో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు మెడికల్ లీగల్ కేసు (MLC)గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనపై, తన తండ్రిపై దాడి చేసిన భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TOP