September 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం

ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజు సభా కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఉండి రాజకీయంలో కొత్త అధ్యాయం: 2029 టార్గెట్..

పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ‘ఉండి’ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పోరాటాలకు వేదికయ్యే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మంతెన యోగేంద్రబాబు శైలి, ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.

బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ సమయంలోనే క్షేత్రస్థాయిలో పార్టీకి సరికొత్త ఊపిరి ఊదడంలో యోగేంద్రబాబు సఫలమవుతున్నారనే అభిప్రాయం కేడర్‌లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఉత్సాహవంతమైన నాయకత్వం, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఆయన శైలిపై ప్రత్యేక విశ్లేషణ.

క్షేత్రస్థాయికి పార్టీ కార్యచరణ: వేగవంతమైన అడుగులు

ఏ రాజకీయ పార్టీకైనా నాయకత్వ మార్పు జరిగినప్పుడు క్షేత్రస్థాయి కేడర్‌ను సమాయత్తం చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఉండి నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. యోగేంద్రబాబు ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే పార్టీ కార్యక్రమాల్లో గమనాన్ని పెంచారు.

  • గ్రామ స్థాయి భేటీలు: నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలో పర్యటిస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో నేరుగా సమావేశమవుతున్నారు.

  • కార్యకర్తలకు భరోసా: గత ఎన్నికల తదనంతర పరిణామాలతో కొంత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు నేరుగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.

  • ప్రజా సమస్యలపై పోరాటం: స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజల పక్షాన గళమెత్తేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

యువతతో మమేకం: మారిన రాజకీయ వ్యూహం

నేటి రాజకీయాల్లో యువత పాత్ర అత్యంత కీలకమైంది. ఈ విషయాన్ని సరిగ్గా గుర్తించిన యోగేంద్రబాబు, తన పర్యటనల్లో యువతను భాగస్వాములను చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

ఆయన స్వయంగా యువకుడు, ఉత్సాహవంతుడు కావడం వల్ల స్థానిక యువత ఆయనతో సులభంగా మమేకం కాగలుగుతోంది. డిజిటల్ మాధ్యమాలు, ముఖాముఖి సమావేశాల ద్వారా యువతరం ఆలోచనలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తున్నారు. క్రీడా పోటీలు, యువజన సమావేశాల ద్వారా యంగ్ జనరేషన్‌ను పార్టీ వైపు ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రస్తుత రాజకీయ సమీకరణాలు: ఎమ్మెల్యే రఘురామ వర్సెస్ యోగేంద్రబాబు

ప్రస్తుతం ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్, శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకున్న రాజకీయ అనుభవం, మీడియా కవరేజ్, ప్రచార శైలికి సరిజోడుగా క్షేత్రస్థాయిలో గట్టి పోటీనిచ్చే నాయకత్వం కోసం వైఎస్సార్‌సీపీ చూస్తున్న తరుణంలో యోగేంద్రబాబు రాక ఆ లోటును భర్తీ చేసినట్లయింది.

రఘురామకృష్ణంరాజు వంటి సీనియర్ నాయకుడిని ఎదుర్కోవాలంటే కేవలం మైక్ ముందు మాట్లాడటం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రతి ఇల్లు తిరిగే ఓర్పు, జనంతో మమేకమయ్యే ఉత్సాహం అవసరం. యోగేంద్రబాబు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు అనుభవానికి, యోగేంద్రబాబు యువ రక్తం, వేగానికి మధ్య సాగుతున్న ఈ రాజకీయ సమరం ఉండిలో ఆసక్తికరంగా మారింది.

ప్రజాభిప్రాయం: వచ్చే ఎన్నికల్లో జెండా ఎగిరేనా?

ఉండి నియోజకవర్గ ప్రజా బాహుళ్యంలో, రాజకీయ విశ్లేషకుల్లో ఇప్పుడు ఒకటే చర్చ సాగుతోంది. యోగేంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చూపిస్తున్న ఇదే స్పీడ్‌ను, పట్టుదలను చివరి వరకు కొనసాగిస్తే... వచ్చే ఎన్నికల్లో ఉండిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమనే ధీమా కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

స్థానిక ప్రజల నుంచి వస్తున్న స్పందన, తటస్థుల నుంచి లభిస్తున్న మద్దతు పార్టీకి సానుకూల అంశాలుగా మారుతున్నాయి. నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ, ప్రజా సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

విశ్లేషణ: యోగేంద్రబాబు ముందున్న సవాళ్లు

యోగేంద్రబాబు ఆరంభ శూరుడిగా కాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో గెలుపు తీరాలకు చేరాలంటే కొన్ని కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది:

  1. నాయకుల మధ్య సమన్వయం: నియోజకవర్గంలోని పాత, కొత్త నాయకత్వాల మధ్య పూర్తిస్థాయి సమన్వయాన్ని సాధించడం.

  1. స్థిరమైన కార్యాచరణ: ఈ ఉత్సాహాన్ని, వేగాన్ని ఎన్నికల వరకు ఏమాత్రం తగ్గకుండా నిలబెట్టుకోవడం.

  1. బూత్ స్థాయి నెట్‌వర్క్: ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో బలమైన కార్యకర్తల సైన్యాన్ని సిద్ధం చేసుకోవడం.

యోగేంద్రబాబు రాకతో ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీలో కొత్త అధ్యాయం ప్రారంభమైందనడంలో సందేహం లేదు. ఆయన చూపిస్తున్న చురుకుదనం, యువతతో అనుబంధం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చూపిస్తున్న తెగువ పార్టీకి కొత్త ఊపునిచ్చాయి. ఈ జోరును ఇలాగే కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే, రాబోయే ఎన్నికల్లో ఉండి గడ్డపై వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది.

జగన్ సారధ్యంలో జాతికోసం మరింతగా..!

పిన్న వయసులోనే జాతికోసం ఆలోచించాడా యువకుడు.. రాష్ట్రస్థాయి జర్నలిస్టుగా, మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే కెరీర్ ను పణంగా పెట్టి కులం కోసం నడుంబిగించాడు.. 2018లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ స్థాపించాడు.. దూదేకుల ముస్లింలకు సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదని గొంతెత్లి నినదించాడు.. అమరావతిలో పొలిటికల్ జేఏసీ ప్రారంభించి అక్కడే కార్యాలయాన్ని నెలకొల్పాడు.. 2019 ఎన్నికల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, దూదేకుల సమాజానికి తన ఉద్దేశాన్ని బలంగా చాటిచెప్పాడు..

ఉన్నత వర్గాల్లోని రాజకీయ కుటుంబాల్లో ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లు ఉండొచ్చు కానీ వెనుకబడిన, విస్మరించబడిన దూదేకుల జాతినుండి ఒక్క ఎమ్మెల్యే ఉండకూడదా అని ప్రశ్నించాడు.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడమే కాదు.. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ నినాదాన్ని వదిలిపెట్టలేదు.. ప్రధాన మీడియా చానెళ్లలో డిబేట్లు, పత్రికల్లో వార్తలు ఊపందుకున్నాయి. దూదేకుల కులం గురించి సర్వత్రా చర్చించుకున్నారు. కేవలం దస్తగిరి అనే యువకుడు నడుం బిగించడం వల్లే..కేవలం రాజకీయ అజెండానే కాదు దూదేకుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసాడు.. దూదేకుల కులం ఎదుర్కుంటున్న అసభ్య పదాలను తొలగిస్తూ జీవో తెచ్చిన ఘనత దస్తగిరిదే.. అసలు దూదేకుల కమ్యూనిటీ పేరుతో జివో రావడమే మొదటిది..

దస్తగిరి పోరాటాన్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీలో చేరిన వెనువెంటనే వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి సాధించాడు.. దస్తగిరి చేస్తున్నది రాజకీయ పోరాటమే, దూదేకుల ఉనికిని బ్రతికించడమో కాదు.. అధికారంలో భాగస్వామ్యం, ఆత్మగౌరవ పోరాటం.. దూదేకులంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం కాదు రాష్ట్రంలోని ప్రధాన కులాల్లో మాదీ సింహభాగమేనన్న గుర్తింపు.. చిన్న వయసునుండే పోరాటాలు, కులం కోసం ఉద్యమాలు చేపట్టిన దస్తగిరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, జాతికోసం మరింత వేగంగా అడుగులు వేయాలని యావత్ దూదేకుల సమాజం ఆశిస్తోంది.. ఆశీర్వదిస్తోంది..

అజయ్ ను చట్టపరంగా శిక్షిస్తాం.. జగన్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన మల్లీశ్వరి

ఏపీ రాజకీయాల్లో తెనాలి మహిళ గీతాంజలి మరణం వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి, సోషల్ మీడియా వార్‌కు ఆఘటన కారణయమైంది. టీడీపీ , జనసేన ట్రోలింగ్ కారణంగానే మానసిక వేదనతో గీతాంజలి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపించారు. అప్పటి వైసీపీ మంత్రులు గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ కేసులో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అజయ్ సజ్జాను గతంలో పోలీసులు అరెస్టు చేసారు. అజయ్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయటం వల్లే గీతాంజలి మృతి చెందిందని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. అనంతరం అజయ్ బెయిల్ పై విడుదలయ్యారు.. ఇదంతా గతం..

అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చిందంటే.. వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లీశ్వరి ఇటీవల ఓ టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతున్నారు.. అదే డిబేట్ లో టీడీపీ తరపున పాల్గొన్న అజయ్ సజ్జా సబ్జెక్ట్ మాట్లాడకుండా జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే అనే పదం ఉపయోగించారు. వెంటనే కోపం చిర్రెత్తుకురావడంతో మల్లీశ్వరి రెచ్చిపోయారు. దమ్ము ధైర్యం లాంటి పదాలు ఉపయోగించవద్దని ఇప్పటికే లక్షసార్లు చెప్పానని అయినా నువ్వు మారడం లేదన్నారు. ఇలా విసిగించే గీతాంజలి మరణానికి కారణమయ్యావని, 2029లో వైసీపీ ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఇందుకు మూల్యం చెల్లించుకుంటావని, చట్టపరంగా ఆ కేసుపై మరింత దర్యాప్తు జరిపి శిక్షిస్తామన్నారు.

మల్లీశ్వరి మాటలకు అజయ్ నోట మాట రాలేదు.. పైగా మల్లీశ్వరి ఎంతో కాన్ఫిడెన్స్ తో 2029లో తమ ప్రభుత్వం వస్తుందని నమ్మడం.. అలాగే జగన్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడినందుకు ఒక్కసారిగా విరుచుకు పడడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకురాలు కదా మనకి కావాల్సింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు..

రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటి

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీమంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి న్శాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. సోమవారం తెల్లవారుజామున ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది

కూటమి నేతలు కామంతో రెచ్చిపోతున్నారు – హరీష్

అధికారన్ని అడ్డం పెట్టుకుని జనసేన, టీడీపీ నేతలు కామంతో రెచ్చిపోతున్నారని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ యువ నాయకులు గొంతే హరీష్ ఆరోపించారు. జనసేన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని వాడుకొని వదిలేసాడని, తనకి పెళ్లై కొడుకు కూడా ఉన్నాడని తెలిసినా కానీ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కారులో దూరంగా తీసుకెళ్లి రేప్ చేశాడంటూ బాధిత మహిళ చెప్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, గతంలో సాక్ష్యాత్తూ మంత్రి వాసంశెట్టి సుభాస్ అశ్లీల నృత్యాల్లో పాల్గొనడం ఎంతవరకూ కరెక్ట్ అని హరీష్ ప్రశ్నించారు. కూటమిప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం చేయలేదని, కేవలం అరాచకాలు, అకృత్యాలు మాత్రమే చేస్తోందన్నారు. వచ్చే జగన్ 2.0 పాలనలో మహిళల రక్షణకు దిశ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి అభివృద్ధి చేసే పార్టీ వైసీపీ మాత్రమేనన్నారు హరీష్..

దాదా మృతిపట్ల జగన్ దిగ్భ్రాంతి

YS Jagan: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అకాల మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అజిత్‌ పవార్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారిఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు.

మహారాష్ట్ర బారామతిలో ల్యాండింగ్ సమయంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

TOP