September 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

బెస్ట్ బూత్ లెవల్ ఆఫీసర్‌గా రాజారావు..

పామర్రు:

కృష్ణా జిల్లా స్థాయిలో పామర్రు నియోజకవర్గం తరుపున పెరుమాళ్ల రాజారావు ఉత్తమ బిఎల్‌ఓగా ఎంపికయ్యారు. పెదపారుపూడి మండలం చినపారుపూడి స్వర్ణ గ్రామ కార్యాలయం నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజారావు అదే సచివాలయ పరిధిలో ఉన్న అప్పికట్ల గ్రామ పోలింగ్ బూత్‌ నందు బూత్ లెవల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా భారత ఎన్నికలసంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్నం దు రాజారావు ఉత్తమ పనితనం కనబరిచారు. పామర్రు నియోజకవర్గం ఎన్నికల హెడ్ ఆఫీస్ అయినటువంటి పామర్రు ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఫోన్ చేసి నియోజకవర్గం తరుపున ఉత్తమ బిఎల్‌ఓగా ఎంపికైన విషయాన్ని రాజారావుకు తెలియజేశారు. ది. 25-1-26న 16వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్ నందు కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతిని రాజారావు అందుకోనున్నారు. ఈ సందర్భంగా రాజారావుకు పెదపారుపూడి మండలంలో ఉన్న తోటి బిఎల్‌ఓలు, తోటి సచివాలయ ఉద్యోగులు, ఎంపిడీఓ, ఎమ్మార్వో కార్యాలయం వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

జగన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగు ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్’ అని పేర్కొన్నారు.

TOP