హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్డులోని తెలుగు సీఫీ క్రైస్తవ విద్యాసేవ కార్యాలయంలో శ్రీమతి రాచకొండ విజయకుమారి గారి జ్ఞాపకార్థం వారి భర్త శాంతమూర్తి సోలార్ లైటింగ్ సిస్టమ్ మరియు ఫ్యాన్‌లను బహూకరించారు. ఈ సోలార్ లైటింగ్ సిస్టమ్‌ను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి వై.ఎస్. విమలా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాచకొండ విజయకుమారి గారు దేవునియందు భయ భక్తులు కలిగినవారు, విద్యార్థుల పట్ల అంకితభావం కలిగిన ఉత్తమ ఉపాధ్యాయురాలని పేర్కొన్నారు.
ఆమె విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్రవేసినారని కొనియాడారు. సెప్టెంబర్ 2025లో తెలుగు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రభుత్వ తరఫున అందుకున్న ఆమె సేవలు ప్రశంసనీయమని తెలిపారు. విజయకుమారి జ్ఞాపకార్థం తెలుగు సీఫీ కార్యాలయంలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయించిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆమె గుర్తుగా శాంతమూర్తి ఈ కార్యక్రమం నిర్వహించడంపై అభినందించారు. భార్యపై ప్రేమను ఈ విధంగా చాటుకోవడం గొప్పవిషయమని పలువురు కొనియాడారు. ఈ సోలార్ సిస్టమ్‌ను son.et Lumiere సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పృధ్వీరాజ్ రెడ్డి, జయప్రకాశ్, జగన్ మోహన్ రెడ్డి, టి.సురేష్, మౌనిక, ఆశ ప్రశాంతి, ఫిలిప్, భాస్కర్, భారతీ భాస్కర్, చల్లా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

