కొల్లోజు దిలీప్.. యువకుడు..నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు.. విద్యార్థుల సమస్యల కోసం పోరాడినవాడు.. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు..
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 4 వ వార్డ్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొల్లోజు దిలీప్ ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బరిలోకి దించారు..ఇంకా బీ ఫాం ఇవ్వనప్పటికీ 4 వ వార్డ్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొల్లోజు దిలీప్ పోటీలో ఉన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది… దిలీప్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో విద్యా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు…దీంతో మున్సిపల్ బరిలో దిలీప్ ఉన్నాడంటూ ప్రచారం మొదలు కావడం తో ప్రత్యర్థుల గుండెల్లో దడ మొదలైంది…
ఎన్నికల బరిలో దిలీప్ ఉంటే తమకు ఓటమీ ఖరారు అని తెలుసుకున్న ప్రత్యర్థులు ఇప్పటినుండే దిలీప్ ను ఎన్నికల బరి నుండి తొలగించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఓ వైపు ప్రజల మద్దతు మాత్రం అనూహ్యంగా దిలీప్ వైపే ఉండటం చూసి ప్రత్యర్ధులు కంగారు పడుతున్నారు..ఎక్కడ దిలీప్ కు లభించే మద్దతు తమ ఓటమికి కారణమవుతుందోనని బయపడుతున్నారు…
మరో పక్క కొల్లోజు దిలీప్ మాత్రం తనకు పార్టీ టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు.. కష్ట పడే మనస్తత్వము ఉన్నవాన్ని,ప్రజా సమస్యల పై పోరాటం చేసే వాడిని కనుక గండ్ర వెంకట రమణా రెడ్డి తనకే టికెట్ కేటాయిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..4 వ వార్డు నుండి తాను లోకల్ అభ్యర్ధి అని, మిగతా వారు నాన్ లోకల్ కాబట్టి ప్రజల మద్దతు తనకే ఉంటుందని ఆయన నమ్ముతున్నారు…గతం లో గెలిచిన అభ్యర్థులు ఓట్ల అప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు..
తనకు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే 4 వ వార్డ్ లో విజయ పతాకం ఎగురవేసి గండ్ర వెంకట రమణా రెడ్డి కి, బీఆర్ఎస్ పార్టీ కి 4 వ వార్డు ను గిఫ్ట్ గా అందిస్తానని దిలీప్ చెబుతున్నారు.

