ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభా కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.

