February 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో రోజురోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఇప్పుడు నేరుగా రాష్ట్రంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇటీవలే డిజి గా పదోన్నతి పొందిన విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఈ కేసులో బిట్ కాయిన్ రూపంలో కోటికి పైగా విలువచేసే లంచం తీసుకున్నారని ఆరోపణలు గుప్పమన్నాయి.. ఈ కేసులో మొదటి నుంచి అత్యంత దూకుడుగా వ్యవహరించిన బాగ్చి పై గతంలోనే మాజీఎంపీ హర్ష కుమార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు మరొకసారి తెరపైకి వచ్చాయి.. ఈ కేసులో కమిషనర్ డబ్బులు తీసుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పిన మాటలు నిజం చేస్తూ ఇప్పుడు తెరపైకి కొన్ని ఆడియోలు వచ్చాయి. ఈ ఆడియోలలో అజీమ్ ఖాన్ అనే నిందితుడు నేరుగా పోలీస్ కమిషనర్ కు బిట్ కాయిన్ రూపంలో కోటిన్నరకు పైగా లంచం ఇచ్చి అతనికి కోపం ఉన్న వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టాలని పోలీస్ కమిషనర్ పై ఒత్తిడి తీసుకురావడంతో అదేవిధంగా ఇప్పుడు అతను అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ఈ కేసులో నిందితుడిగా ఉన్న రతన్ రాజ్ మీడియా ముందుకు వచ్చి ఆడియోలను విడుదల చేశారు. ఈ ఆడియోలలో ఎంత నిజం ఉందో లేదో దర్యాప్తు చేయాలని అంతేకాకుండా రతన్ రాజ్ ఈ కేసులో తమకు ఎటువంటి ప్రమేయం లేదని తనపై రోజురోజుకి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఈ కేసును సిబిఐ లేదా సిఐడి విచారించి నిజ నిజాలను తేల్చాలని తెలిపారు.

పుట్టుకతో అనేక ఆస్తులు ఉన్న తనను హనీ ట్రాప్ చేసి డబ్బులు సంపాదించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయని రతన్ రాజ్ మీడియా వేదికగా అధికారులను ప్రశ్నించాడు.. తనకు న్యాయం జరగాలని తనపై జరుగుతున్న ఈ కుట్రకు కారకులెవరు తెలియాలని చెప్పారు.. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన జాయ్ జెమిమా తో పాటు నిందితులందరూ బెయిల్ పై బయట ఉండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా రతన్ రాజు పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన జాయ్ బయట ఉండగా ఏ 6 గా ఉన్న రతన్ రాజ్ పై పోలీసులు కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ అనేక ఆరోపణలు కూడా బయటకు వినిపిస్తున్నాయి. అసలు విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఏం జరుగుతుందంటూ అనేక అనుమానాలకు తావతీస్తున్న పరిస్థితులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నేరుగా అజీంఖాననే నిందితుడు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు కాకపోవడం అతను అరెస్టు కాకుండా ఉంటూ మరికొంతమంది నేనే అరెస్టులు చేయిస్తున్నానని వాటికి గాను పోలీస్ కమిషనర్ కి బిట్ కాయిన్ రూపంలో లంచం అందజేశానని చెప్పడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావుతీస్తుంది. అయితే ఈ విషయంపై పోలీస్ కమిషనర్ స్పందించాల్సి ఉంది. అసలు ప్రపంచంలో ఏ కేసులు లేనట్టుగా పోలీస్ కమిషనర్ ఈ కేసులో ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తూ అరెస్టులకు తెగబడ్డారని నిందితులు ప్రశ్నిస్తున్నారు.

అనూషంగా ఈ కేసులో జాయ్ ఇంట్లో పని చేసే కొంత మందిని సైతం రిమాండ్ చేశారు. ఈ రిమాండ్ చేసిన నిందితులలో తన్వీర్ జోయ తన మూడు నెలల చిన్నారితో సహా జైలులో 13 నెలలపాటు రిమాండ్ లో ఉండవలసి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో 15 నెలల గడుస్తున్నా చార్జి సీటు వేయకపోవడం అంతేకాకుండా అరెస్టులు సంఖ్య పెరగడం కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతోని అత్యంత కీలకమైన కిడ్నాప్, హత్యాయత్నం వంటి సెక్షన్లో పెట్టి రిమాండ్ చేయడం పట్ల అనేక అనుమానాలకు తావుతీస్తుంది. ఈ కేసులో మొట్టమొదటిగా పోలీసులు రతన్ రాజుని ప్రధాన నిందితురాలుపై ఫిర్యాదు ఇవ్వమని కోరారు.. కానీ రతన్ ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో అతనిని నిందితుడిగా కోరుకుంటూ రిమాండ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పటికైనా తనకు న్యాయం జరపాలి అంటూ చెబుతున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TOP