February 15, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

పామర్రు:

కృష్ణా జిల్లా స్థాయిలో పామర్రు నియోజకవర్గం తరుపున పెరుమాళ్ల రాజారావు ఉత్తమ బిఎల్‌ఓగా ఎంపికయ్యారు. పెదపారుపూడి మండలం చినపారుపూడి స్వర్ణ గ్రామ కార్యాలయం నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజారావు అదే సచివాలయ పరిధిలో ఉన్న అప్పికట్ల గ్రామ పోలింగ్ బూత్‌ నందు బూత్ లెవల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా భారత ఎన్నికలసంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్నం దు రాజారావు ఉత్తమ పనితనం కనబరిచారు. పామర్రు నియోజకవర్గం ఎన్నికల హెడ్ ఆఫీస్ అయినటువంటి పామర్రు ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఫోన్ చేసి నియోజకవర్గం తరుపున ఉత్తమ బిఎల్‌ఓగా ఎంపికైన విషయాన్ని రాజారావుకు తెలియజేశారు. ది. 25-1-26న 16వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్ నందు కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతిని రాజారావు అందుకోనున్నారు. ఈ సందర్భంగా రాజారావుకు పెదపారుపూడి మండలంలో ఉన్న తోటి బిఎల్‌ఓలు, తోటి సచివాలయ ఉద్యోగులు, ఎంపిడీఓ, ఎమ్మార్వో కార్యాలయం వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TOP