August 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా జంట.. అఖిల్ , మేఘా . ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరికీ లక్షలాది మంది ఫాలోవర్లు. క్యూట్ వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్‌తో ఎంతోమందికి ఫేవరెట్ కపుల్‌గా మారిపోయారు. కానీ.. ఆ చిరునవ్వుల వెనుక దాగి ఉన్న నిజం మాత్రం ఇప్పుడు బయటపడిందంటూ అఖిల్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

తన భార్య మేఘా.. ఓ లోకల్ బస్సు క్లీన‌ర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అఖిల్ ఆరోపించాడు. అంతేకాదు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులు కూడా తీసుకెళ్లిందని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు తమ ప్రేమకథను చూసి అసూయపడిన వాళ్లే. ఇప్పుడు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇంత హ్యాపీగా కనిపించిన వాళ్ల జీవితంలో ఇంత పెద్ద తుఫాన్ ఉందా..?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ విడుదల చేసిన వీడియోలో.. తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించాడు. తాను తీవ్ర మానసిక వేదనలో ఉన్నానని కూడా చెప్పాడు.

అయితే.. ఈ వ్యవహారంపై మేఘా నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఆమె వాదన ఏంటి..? నిజంగా ఏం జరిగింది..? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి నవ్వు నిజమైన ఆనందమే కాదు. ప్రతి రిలేషన్‌షిప్ కూడా బయటకు కనిపించినంత పరిపూర్ణంగా ఉండకపోవచ్చు అనే చర్చ ఇప్పుడు మరోసారి మొదలైంది.

ఒక వైరల్ వీడియోతో మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అఖిల్ చేసిన ఆరోపణలు మాత్రమే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మేఘా స్పందన, అలాగే అధికారిక వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూర్తి నిజాలు బయటపడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో కనిపించే జీవితానికీ.. నిజ జీవితానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో చెప్పే మరో ఉదాహరణగా ఈ ఘటన చర్చనీయాంశమవుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TOP