అధికారన్ని అడ్డం పెట్టుకుని జనసేన, టీడీపీ నేతలు కామంతో రెచ్చిపోతున్నారని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ యువ నాయకులు గొంతే హరీష్ ఆరోపించారు. జనసేన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని వాడుకొని వదిలేసాడని, తనకి పెళ్లై కొడుకు కూడా ఉన్నాడని తెలిసినా కానీ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కారులో దూరంగా తీసుకెళ్లి రేప్ చేశాడంటూ బాధిత మహిళ చెప్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, గతంలో సాక్ష్యాత్తూ మంత్రి వాసంశెట్టి సుభాస్ అశ్లీల నృత్యాల్లో పాల్గొనడం ఎంతవరకూ కరెక్ట్ అని హరీష్ ప్రశ్నించారు. కూటమిప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం చేయలేదని, కేవలం అరాచకాలు, అకృత్యాలు మాత్రమే చేస్తోందన్నారు. వచ్చే జగన్ 2.0 పాలనలో మహిళల రక్షణకు దిశ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి అభివృద్ధి చేసే పార్టీ వైసీపీ మాత్రమేనన్నారు హరీష్..
Month: January 2026
దాదా మృతిపట్ల జగన్ దిగ్భ్రాంతి
YS Jagan: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అకాల మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారిఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు.
మహారాష్ట్ర బారామతిలో ల్యాండింగ్ సమయంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హైల్మెట్ తలకు భారం కాదు.. బాధ్యత..!
37వ జాతీయ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సేఫ్ ఏ, ఎన్ హెచ్ ఐ మరియు తణుకు MVI ఎస్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో తణుకు ఉమెన్స్ కాలేజ్ హైవే 216Aపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉపయోగాలను వివరించారు. హైల్మెట్ తలకు భారం కాదని బాధ్యతగా ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. కారుల్లోప్రయాణించే వ్యక్తులకు సీట్ బెల్ట్ ఉపయోగాలు తెలియజేసారు.
ప్రాజెక్ట్ మేనేజర్ కే బాలసుబ్రమణ్యం, వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, హైవే సిబ్బంది పాల్గొన్నారు.
APGEA పామర్రు యూనిట్ కార్యవర్గం ఎన్నిక
ఆంధ్ర ప్రదేశ్ (కృష్ణా - పామర్రు) : ది. 26-1-2026న APGEA పామర్రు యూనిట్ కార్యవర్గం యొక్క ఎన్నికలు పామర్రు నందు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల కోసం APGEA కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు అయినటువంటి శ్రీ టి. రాము గారి ఆద్వర్యంలో, జిల్లా కార్యవర్గంచే జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ తోట ప్రసాద్ ను ఎలక్షన్ ఆఫీసర్ గా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ కోటేశ్వరరావును అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించడమైనది. కావున ఎలక్షన్ ప్రక్రియను వారు నిర్వహించి పామర్రు యూనిట్ యొక్క APGEA కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలలో షేక్ మెహరున్నిస బేగం అధ్యక్షలుగా ఎన్నిక అయ్యారు. కె విజయ కుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా, యన్ ఆంజనేయలు ప్రధాన కార్యదర్శిగా, శివ నాగమణి కోశాదికారి గా ఎన్నిక అయ్యారు.
APGEA పామర్రు యూనిట్ మాజీ అధ్యక్షులు అయిన శ్రీ కొలుసు యేసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మొత్తం 17 మందితో కూడిన ఈ టీం యొక్క వివరాలు
1) అధ్యక్షులు – షేక్ మెహరున్నీసా బేగం
2) అసోసియేట్ ప్రెసిడెంట్ – కె. విజయ్ కుమార్
3) ప్రధాన కార్యదర్శి – యన్ యన్ ఆంజనేయులు
4) కోశాధికారి – యమ్. శివనాగ మణి
5) ఆర్గనైజింగ్ సెక్రటరీ – ఆర్.లక్ష్మయ్య
6) వైస్ ప్రెసిడెంట్ 1 – యమ్. సబెరుద్దిన్
7) వైస్ ప్రెసిడెంట్ 2 – అరుణకుమారి
8) వైస్ ప్రెసిడెంట్ 3 – పరంజ్యోతి
9) వైస్ ప్రెసిడెంట్ 4 - యమ్. సతీష్
10) వైస్ ప్రెసిడెంట్ 5 – కె. సాయి బాబు
11) వైస్ ప్రెసిడెంట్ 6 - పి రాజారావు
12) జాయింట్ సెక్రటరీ 1 – అమృతరావు
13) జాయింట్ సెక్రటరీ 2 – ఆర్. రామ కృష్ణ
14) జాయింట్ సెక్రటరీ 3 – యం.అలీ
15) జాయింట్ సెక్రటరీ 4 – యం. బ్రహ్మ నాయుడు
16) జాయింట్ సెక్రటరీ 5 - యమ్. లీలా కృష్ణా
17) జాయింట్ సెక్రటరీ 6 - జి రమాదేవి
బెస్ట్ బూత్ లెవల్ ఆఫీసర్‌గా రాజారావు..
పామర్రు:
కృష్ణా జిల్లా స్థాయిలో పామర్రు నియోజకవర్గం తరుపున పెరుమాళ్ల రాజారావు ఉత్తమ బిఎల్‌ఓగా ఎంపికయ్యారు. పెదపారుపూడి మండలం చినపారుపూడి స్వర్ణ గ్రామ కార్యాలయం నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజారావు అదే సచివాలయ పరిధిలో ఉన్న అప్పికట్ల గ్రామ పోలింగ్ బూత్ నందు బూత్ లెవల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా భారత ఎన్నికలసంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్నం దు రాజారావు ఉత్తమ పనితనం కనబరిచారు. పామర్రు నియోజకవర్గం ఎన్నికల హెడ్ ఆఫీస్ అయినటువంటి పామర్రు ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఫోన్ చేసి నియోజకవర్గం తరుపున ఉత్తమ బిఎల్‌ఓగా ఎంపికైన విషయాన్ని రాజారావుకు తెలియజేశారు. ది. 25-1-26న 16వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్ నందు కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతిని రాజారావు అందుకోనున్నారు. ఈ సందర్భంగా రాజారావుకు పెదపారుపూడి మండలంలో ఉన్న తోటి బిఎల్‌ఓలు, తోటి సచివాలయ ఉద్యోగులు, ఎంపిడీఓ, ఎమ్మార్వో కార్యాలయం వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
జగన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగు ప్రజలకు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్’ అని పేర్కొన్నారు.






